ఏపీ ముఖ్యమంత్రి జగన్, విజయసాయిరెడ్డిలకు ఈడీ కోర్టు సమన్లు
- అరబిందో, హెటిరోలకు భూ కేటాయింపుల కేసు
- నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు కేసు బదిలీ
- 11న విచారణకు హాజరు కావాలంటూ ఆదేశం
అరబిందో, హెటిరో భూ కేటాయింపుల కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అరబిందో, హెటిరో సంస్థలకు భూ కేటాయింపుల చార్జిషీట్ ఇటీవల నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో ఈ సమన్లు జారీ అయ్యాయి. చార్జిషీట్ విచారణను స్వీకరించిన కోర్టు.. సీఎం జగన్‌తోపాటు విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి, పీవీ రాజేంద్రప్రసాద్‌రెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ చంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ బీపీ ఆచార్యలకు కోర్టు సమన్లు జారీ చేసింది.