లేదు.. ఆయన ప్రమాణస్వీకారానికి నేను వెళ్లను: ట్రంప్
- ఇటీవల వరుసగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్
- ఓటమిని అంగీకరించకుండా మొండిపట్టు
- శ్వేతసౌధాన్ని విడిచిపెట్టనంటూ మరోమారు వ్యాఖ్యలు
అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లోకి ఎక్కుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు అటువంటి నిర్ణయమే తీసుకున్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, ఆయన ప్రమాణస్వీకారానికి తాను వెళ్లబోనని ట్రంప్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తాను ఎందుకు వెళ్లబోవడం లేదన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడింలేదు.
అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. బైడెన్ గెలుపును అంగీకరించనంటూ ఓసారి, శ్వేతసౌధాన్ని విడిచిపెట్టబోనంటూ మరోసారి వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఇటీవల అమెరికన్ కేపిటల్ భవనంపై ఆయన మద్దతుదారులు హింసకు పాల్పడడంతో ట్రంప్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఈ నేపథ్యంలో ఆయన తాజా ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది.