విగ్రహాల ధ్వంసం ఘటనలపై సిట్ దర్యాప్తు... ఏపీ సర్కారు కీలక నిర్ణయం
- కొన్నిరోజుల కిందట సీఐడీకి అప్పగించిన సర్కారు
- తాజాగా 16 మందితో సిట్ ఏర్పాటు
- సిట్ చీఫ్ గా జీవీజీ అశోక్ కుమార్
- ఆలయాలకు సంబంధించిన అన్ని కేసులను విచారించనున్న సిట్
రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలపై దర్యాప్తు బాధ్యతలను ఇటీవల సీబీసీఐడీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మనసు మార్చుకుంది. ఈ ఘటనలపై దర్యాప్తు బాధ్యతలను సీఐడీ నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు బదలాయిస్తున్నట్టు ఏపీ సర్కారు ప్రకటన చేసింది.
ఈ మేరకు 16 మందితో కూడిన సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్ గా జీవీజీ అశోక్ కుమార్ ను నియమించింది. ప్రస్తుతం అశోక్ కుమార్ ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆలయాలకు సంబంధించిన అన్ని ఘటనలను ఈ సిట్ విచారించనుంది.
కాగా, ప్రభుత్వం ఈ కేసులను సిట్ కు బదలాయించడంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హర్షం వ్యక్తం చేశారు. తాము కోరిన విధంగా ఈ కేసులపై సిట్ ఏర్పాటు చేశారంటూ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.