నాగచైతన్య సినిమాలో అవికా గోర్!
- విక్రంకుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ'
- హాకీ ప్లేయర్ పాత్రలో నాగ ఛైతన్య
- మహేశ్ బాబుకి ఫ్యాన్ గా చైతు
- ఒక కథానాయికగా అవికా గోర్ ఎంపిక
గతంలో 'ఉయ్యాల జంపాల' సినిమాతో మంచి నటిగా పేరుతెచ్చుకున్న కథానాయిక అవికా గోర్.. ఆ తర్వాత రెండు, మూడు సినిమాలు చేసినా అవి ఆమెకు అంతగా ఉపయోగపడలేదు. పైపెచ్చు, ఆమె కూడా టాలీవుడ్ మీద అంతగా దృష్టిపెట్టలేదు కూడా. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ సినిమాలు చేయాలని అభిలషిస్తున్న ఈ చిన్నదానికి తాజాగా ఓ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.
ఇటీవలే 'లవ్ స్టోరీ' చిత్రాన్ని పూర్తిచేసిన అక్కినేని నాగచైతన్య తన తదుపరి చిత్రంగా 'థ్యాంక్యూ' చేస్తున్నాడు. 'మనం' ఫేమ్ విక్రంకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. ఇందులో ఇద్దరు, ముగ్గురు కథానాయికలు ఉంటారని అంటున్నారు. తాజాగా వారిలో ఒకరిగా అవికా గోర్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మరో కథానాయికగా సమంత నటిస్తుందని సమాచారం.
ఈ 'థ్యాంక్యూ' సినిమాలో చైతన్య హాకీ ప్లేయర్ గా నటిస్తున్నాడు. ఇందుకోసం హాకీలో కాస్త తర్ఫీదు కూడా పొందాడట. అలాగే ఈ సినిమాలో మహేశ్ బాబుకి అభిమానిగా కూడా చైతు కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది.