ఐటీ స్టాకుల జోరు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు!
- 689 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 207 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 6 శాతం వరకు పెరిగిన మారుతి సుజుకి షేర్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ఐటీ దిగ్గజాలు ఈరోజు మార్కెట్లను ముందుండి నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 689 పాయింట్లు పెరిగి 48,783కి ఎగబాకింది. నిఫ్టీ 209 పాయింట్లు లాభపడి 14,347కు చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి సుజుకి (5.86%), టెక్ మహీంద్రా (5.25%), ఇన్ఫోసిస్ (3.97%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.45%), అల్ట్రాటెక్ సిమెంట్ (3.40%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.59%), భారతి ఎయిర్ టెల్ (-0.93%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.45%), ఐటీసీ (-0.30%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.26%).