ఏపీ సీఎం జగన్ కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ
- నంద్యాల నూతన బోధనాసుపత్రి స్థల కేటాయింపుపై అభ్యంతరాలు
- రైతాంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది
- వ్యవసాయ పరిశోధన స్థలంలో నిర్మాంచాలనుకుంటున్నారు
నంద్యాల నూతన బోధనాసుపత్రి స్థల కేటాయింపుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచించాలని అన్నారు. దేశంలోని అన్ని జిల్లాల్లో బోధనాసుపత్రులు ఉండాలన్న ప్రధాని మోదీ సర్కారు లక్ష్యానికి అనుగుణంగా ఏపీలో బోధనాసుపత్రులు లేని జిల్లాల్లో వీటిని నిర్మిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
ఒక్కో బోధనాసుపత్రికి మోదీ ప్రభుత్వం రూ.50 కోట్ల కేటాయించి సహకారం అందిస్తోందని చెప్పుకొచ్చారు. అయితే, నంద్యాలలో బోధనాసుపత్రి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థల విషయంలో మాత్రం రైతాంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, నంద్యాలలో ప్రసిద్ధి చెందిన వ్యవసాయ పరిశోధన స్థలంలో నిర్మాంచాలనుకోవడం దీనికి కారణమని చెప్పారు. కాబట్టి, పట్టణంలోని మరో ప్రాంతంలో బోధనాసుపత్రి నిర్మించాలని వీర్రాజు కోరారు.