నాకు కూడా కరోనా సోకింది.. ఇప్పుడు తగ్గిందిలెండి: రేణు దేశాయ్

  • చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్నాను
  • కరోనా వల్ల ఇంటికే పరిమితమయ్యాను
  • ఇప్పుడిప్పుడే షూటింగులకు వెళ్తున్నాను
తాను కూడా ఇటీవల కరోనా బారిన పడ్డానని ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్  వెల్లడించారు. వైద్య చికిత్స అనంతరం తాను కోలుకున్నానని చెప్పారు. ప్రస్తుతం తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని అన్నారు. కరోనా సోకడంతో తాను కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితమయ్యానని, షూటింగులకు బ్రేక్ ఇచ్చానని తెలిపారు. ఇప్పుడిప్పుడే మళ్లీ షూటింగులకు వెళ్తున్నానని చెప్పారు. కరోనా ప్రభావం ఇంకా ఏమాత్రం తగ్గలేదని, పరిస్థితులు అలాగే ఉన్నాయని, ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తాను ప్రధాన పాత్రను పోషించిన వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయిందని... త్వరలోనే దానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని రేణు దేశాయ్ చెప్పారు. ఒక క్రేజీ ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని తెలిపారు. వీటితో పాటు రైతు సమస్యలపై తీయబోతున్న సినిమా మార్చి నెలలో సెట్స్ మీదకు వెళ్తుందని చెప్పారు. సోషల్ మీడియాలో లైవ్ ఛాటింగ్ ద్వారా అభిమానులతో ముచ్చటిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News