9 దేవాలయాల పునర్నిర్మాణానికి భూమిపూజ నిర్వహించిన జగన్
- సీతమ్మ పాదాల వద్ద నిర్మాణ పనులకు శంకుస్థాపన
- అనంతరం ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం
- పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ చారిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయవాడలో గత ప్రభుత్వం హయాంలో కూల్చివేసిన 9 ఆలయాలను పునర్నిర్మించే పనులకు ఆయన భూమిపూజ నిర్వహించారు. ఈ ఉదయం 11.01 గంటలకు కృష్ణానది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఇంద్రకీలాద్రికి చేరుకుని దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో పునర్నిర్మిస్తున్న ఆలయాలు ఇవే:
రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో పునర్నిర్మిస్తున్న ఆలయాలు ఇవే:
- సీతమ్మ పాదాలు
- రాహుకేతు ఆలయం
- బొడ్డు బొమ్మ
- శనైశ్చర ఆలయం
- దుర్గగుడి మెట్ల వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయం
- సీతారామ లక్షణ సమేత శ్రీ దాసాంజనేయ ఆలయం
- సీతమ్మ పాదాలకు సమీపంలో దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయం
- పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో ఉన్న వీరబాబు ఆలయం
- కనకదుర్గ నగర్ లో ఉన్న శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం, గోశాల.