సుప్రీంకోర్టులో అంతర్గత వ్యవహారాలన్నీ రహస్యంగా ఉంటాయి: స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం

  • ఇటువంటి సమాచారాన్ని మీడియాకు చెప్ప‌బోం
  • ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం కాదు
  • ఓ అంతర్గత వ్యవహారాన్ని సుప్రీంకోర్టే చెప్పింద‌ని పేర్కొంటూ ఇటీవ‌ల కొన్ని క‌థ‌నాలు 
సుప్రీంకోర్టులో అంతర్గతంగా జరిగే వ్యవహారాలన్నీ సాధార‌ణంగానే అత్యంత రహస్యంగా ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం వివ‌రించింది. ఇటువంటి సమాచారాన్ని మీడియాకు చెప్ప‌బోమ‌ని పేర్కొంది. వాటి సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం కాదని వివ‌రించింది.  

కొందరు జడ్జీలపై వచ్చిన ఆరోపణలపై సీజేఐ చ‌ర్య‌లు తీసుకుంటున్నారంటూ మీడియాలో తాజాగా వ‌చ్చిన కొన్ని కథనాల ప‌ట్ల స్పందిస్తూ సుప్రీం ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు తెలిసింది. ప్ర‌చురిస్తోన్న‌ క‌థ‌నాల ప‌ట్ల‌ విశ్వసనీయతను కాపాడుకోవ‌డానికే మీడియా సంస్థ‌లు.. సుప్రీంకోర్టు నుంచే త‌మకు ఆ స‌మాచారం తెలిసిందంటూ క‌‌థ‌నాల్లో పేర్కొన్నాయని చెప్పింది.

కాగా, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తిపై భారత ప్రధాన న్యాయమూర్తికి ఏపీ సీఎం జగన్ ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ న్యాయ‌మూర్తి నుంచి జస్టిస్‌ బోబ్డే వివరణ కోరారంటూ మీడియాలో కథనాలు వ‌చ్చాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే సుప్రీం తాజాగా వివరణ ఇచ్చింది.


More Telugu News