కృష్ణా పుష్కరాల సమయంలో కూల్చేసిన దేవాలయాల నిర్మాణానికి నేడు జగన్ శంకుస్థాపన!
- అప్పట్లో భక్తుల సౌకర్యార్థం కూల్చివేత
- నేడు జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన
- పనులు పరిశీలించిన బొత్స, వెల్లంపల్లి
కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడ నదీ తీరంలో కూల్చివేసిన తొమ్మిది దేవాలయాల పునర్నిర్మాణానికి నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. నాడు రోడ్డులను వెడల్పు చేసే ప్రయత్నంలో ఆలయాలను తొలగించిన చంద్రబాబు సర్కారు, వాటిని తిరిగి నిర్మిస్తామని చెప్పి, చేయలేదు.
దీంతో ఇప్పుడు జగన్ సర్కారు ఆ బాధ్యతను తీసుకుంది. ఈ దేవాలయాలను సాధ్యమైనంత త్వరగా నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జగన్ శంకుస్థాపన చేయనున్న ఆలయాల పునర్నిర్మాణ భూమిపూజ జరిగే ప్రదేశాన్ని మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బొత్స, కనకదుర్గమ్మ దేవాలయ అభివృద్ధికి రూ. 70 కోట్లను మంజూరు చేశామని వెల్లడించారు.