క్యాపిటల్ హౌస్ పై దాడిని ట్రంప్ ఖండించారన్న వైట్ హౌస్ ప్రతినిధి!

  • క్యాపిటల్ హౌస్ పై నిన్న దాడి
  • ఇది అమెరికా మార్గం కాదు
  • దాడి అనైతికమన్న ట్రంప్
వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హౌస్ పై నిన్న జరిగిన దాడిని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కైలిగ్ మెక్ ఎనానీ మీడియాకు తెలిపారు. "నేను ఒకటి స్పష్టం చేయదలిచాను. మన కాపిటల్ బిల్డింగుపై జరిగిన హింస, అమెరికా మార్గం కానే కాదు. దాడి అనైతికం. తీవ్రంగా పరిగణించతగినది" అని ట్రంప్ వ్యాఖ్యానించినట్టు మెక్ ఎనానీ తెలిపారు. నిన్న ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవంతిలోకి చొచ్చుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ట్రంప్ మీడియా ముందుకు రాలేదు. కొన్ని గంటల తరువాత జరిగిన ఘటనలను ఆయన ఖండిస్తున్నారన్న ప్రకటన మాత్రం విడుదల కావడం గమనార్హం.



More Telugu News