క్రమంగా పెరుగుతున్న తిరుమల హుండీ ఆదాయం!
- నిన్న హుండీ ద్వారా రూ. 2.23 కోట్ల ఆదాయం
- స్వామిని దర్శించుకున్న సుమారు 29 వేల మంది భక్తులు
- ముగిసిన అధ్యయనోత్సవాలు
లాక్ డౌన్ తరువాత తిరిగి తెరచుకున్న తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా లభించే ఆదాయం క్రమంగా పెరుగుతోంది. గురువారం నాడు హుండీ ద్వారా రూ. 2.23 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఇదే సమయంలో 29 వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కాగా, గడచిన 25 రోజులుగా జరుతున్న అధ్యయనోత్సవాలు నిన్నటితో ముగిశాయి. నేటి తెల్లవారుజామున స్వామివారికి అభిషేకం ఏకాంతంగా జరిగింది. నేడు షట్కాల పూజలు, నిత్య కైంకర్యాలు జరుగనున్నాయని అధికారులు తెలిపారు.