కశ్మీర్లో హిమపాతం.... చిక్కుకుపోయిన 'అల్లుడు అదుర్స్' చిత్రబృందం!
- ఇటీవలే కశ్మీర్ వెళ్లిన బెల్లంకొండ శ్రీనివాస్ తదితరులు
- ఓ పాట చిత్రీకరణ
- మంగళవారం తిరిగిరావాల్సిన అల్లుడు అదుర్స్ యూనిట్
- శ్రీనగర్, తదితర ప్రాంతాల్లో భారీగా మంచు
- నిలిచిన రవాణా
జమ్మూ కశ్మీర్ లో గత కొన్నిరోజులుగా తీవ్రస్థాయిలో మంచు కురుస్తోంది. ఈ హిమపాతం ధాటికి కశ్మీర్ లోయలో జనజీవనం స్తంభించింది. కాగా, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న అల్లుడు అదుర్స్ చిత్రం షూటింగ్ నిమిత్తం ఇటీవలే యూనిట్ సభ్యులు కశ్మీర్ వెళ్లారు. అక్కడ ఓ పాట చిత్రీకరించారు.
షూటింగ్ పూర్తవడంతో, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సహా ఇతర చిత్రబృందం మంగళవారం హైదరాబాద్ తిరిగి రావాల్సి ఉంది. శ్రీనగర్ సహా ఇతర ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తుండడంతో రవాణా నిలిచిపోయింది. దాంతో తిరిగొచ్చే వీల్లేక అల్లుడు అదుర్స్ చిత్రబృందం అక్కడే ఆగిపోయింది.
ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజ్ కానుంది. విడుదలకు మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉండడంతో... ప్రమోషన్లు నిర్వహించాల్సిన కీలక సమయంలో యూనిట్ సభ్యులు కశ్మీర్ లో చిక్కుకుపోవడం విచారకరం!