పంక్చర్ షాపుని కూడా వదలడం లేదు దండుపాళ్యం గ్యాంగ్: వీడియో పోస్ట్ చేసిన లోకేశ్
- జీవనాధారమైన షాపుని తొలగించాలని పోలీసుల ఒత్తిడి
- కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించారు
- ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జీవనాధారమైన షాపుని తొలగించాలని పోలీసులు ఒత్తిడి చెయ్యడంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడని తెలుపుతూ ఓ వీడియో పోస్ట్ చేశారు.
'పంక్చర్ షాపుని కూడా వదలడం లేదు వైఎస్ జగన్ దండుపాళ్యం గ్యాంగ్. అనంతపురం జిల్లా, పెనుగొండ నియోజకవర్గం, సోమందేపల్లి మండల కేంద్రంలో పంక్చర్ షాపు జీవనాధారంగా బ్రతుకుతున్న కాలాచారి కుటుంబాన్ని వైకాపా నాయకులు వేధించడం దారుణం' అని ట్వీట్లు చేశారు.
'కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించి జీవనాధారమైన షాపుని తొలగించాలని పోలీసులు ఒత్తిడి చెయ్యడం వలనే కాలాచారి ఆత్మహత్యకు యత్నించాడు. వైకాపా రౌడీలతో కొంతమంది పోలీసులు కుమ్మకై సామాన్యులను హింసించడం మంచి పరిణామం కాదు. ఇటువంటి చర్యలకు పాల్పడితే జగన్ రెడ్డి ప్రజాగ్రహానికి గురికాక తప్పదు' అని లోకేశ్ విమర్శించారు.