విమానాశ్రయం పేరు మార్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన ఉద్ధవ్ థాకరే

  • ఔరంగాబాద్ విమానాశ్రయం పేరును మార్చాలని థాకరే డిమాండ్
  • సాంభాజీ మహరాజ్ విమానాశ్రయంగా మార్చాలని లేఖ
  • ఇప్పటికే దీనికి సంబంధించిన తీర్మానానికి మహా అసెంబ్లీ ఆమోదముద్ర
ఔరంగాబాద్ ఎయిర్ పోర్టు పేరును మార్చాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే డిమాండ్ చేశారు. ఛత్రపతి సాంభాజీ మహరాజ్ విమానాశ్రయంగా మార్చాలని కేంద్రానికి ఆయన లేఖ రాశారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. పేరు మార్పుకు సంబంధించి నోటిఫికేషన్ ను వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి రాసిన లేఖలో ముఖ్యమంత్రి కోరారని తెలిపింది.

మరోవైపు విమానాశ్రయం పేరు మార్పుకు సంబంధించిన తీర్మానానికి మహారాష్ట్ర అసెంబ్లీ ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది. అయితే కేంద్ర ప్రభుత్వంతో శివసేనకు విభేదాలు తీవ్రస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో థాకరే విన్నపం పట్ల కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి.


More Telugu News