ట్రంప్ ఖాతాను లాక్ చేసిన ట్విట్టర్.. పోస్టును తొలగించిన ఫేస్‌బుక్
- అమెరికా క్యాపిటల్ భవనం వద్ద ట్రంప్ మద్దతుదారుల హంగామా
- వరుస ట్వీట్లు చేసిన ట్రంప్.. మూడు ట్వీట్ల తొలగింపు
- ట్రంప్ వీడియో సందేశాన్ని తొలగించిన ఫేస్‌బుక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్, ఫేస్‌బుక్‌లు షాకిచ్చాయి. ట్రంప్ ఖాతాను ట్విట్టర్ లాక్ చేయగా, ఆయన చేసిన పోస్టును ఫేస్‌బుక్ తొలగించింది. అమెరికా క్యాపిటల్ భవనంలోకి ట్రంప్ మద్దతుదారులు దూసుకెళ్లి గలాబా సృష్టించిన తర్వాత ట్రంప్ చేసిన ట్వీట్లే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ట్విట్టర్ నియమాలకు విరుద్ధంగా చేసిన ట్వీట్లను తొలగించాలంటూ ట్రంప్‌ను ట్విట్టర్ కోరింది. తొలగించకుంటే ఖాతాను లాక్ చేస్తామన్న ట్విట్టర్... మూడు ట్వీట్లను తొలగించింది.
మరోవైపు, ఫేస్‌బుక్ కూడా ట్రంప్ వీడియో సందేశాన్ని తొలగించింది. క్యాపిటల్ భవనంలో ఘటన నేపథ్యంలో సంయమనం పాటించాలంటూ ట్రంప్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ వీడియోను తొలగించిన ఫేస్‌బుక్ ట్రంప్ మద్దతుదారుల ఆందోళన నేపథ్యంలోనే దీనిని తొలగించినట్టు వివరణ ఇచ్చింది.