కరోనా వ్యాక్సిన్ యాప్ ఇంకా తీసుకురాలేదు... నకిలీ యాప్ లతో జాగ్రత్తగా ఉండాలి: కేంద్రం
- కొవిన్ పేరుతో యాప్ తీసుకురానున్న కేంద్రం
- అలాంటి పేర్లతోనే నకిలీలు
- ప్రజలను అప్రమత్తం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ
- డౌన్ లోడ్ చేసుకోవద్దని వెల్లడి
- త్వరలోనే అధికారిక యాప్ వస్తుందని వివరణ
కేంద్రం త్వరలోనే కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్ధం చేస్తోంది. అందుకోసం కొవిన్ (Co-WIN) పేరుతో యాప్ తీసుకురానుంది. అయితే, తాము తీసుకురాదలచిన యాప్ తరహాలోనే కొన్ని నకిలీలు యాప్ స్టోర్లలో దర్శనమిస్తుండడం పట్ల కేంద్రం స్పందించింది. తాము ఇంకా అధికారిక యాప్ తీసుకురాలేదని, నకిలీ యాప్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కొవిన్ అని ధ్వనించేలా కొన్ని నకిలీ యాప్ లను మోసపూరిత శక్తులు రూపొందించాయని, వాటిని చూసి మోసపోవద్దని ప్రజలను అప్రమత్తం చేసింది. ఆ నకిలీ యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవద్దని, వాటిలో తమ వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని స్పష్టం చేసింది. అధికారిక యాప్ త్వరలోనే ఆవిష్కరిస్తామని, దానికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.