సోనియాగాంధీ, మాయావతిలను భారతరత్నతో గౌరవించాలి: హరీశ్ రావత్
- వీరి రాజకీయాలతో మీరు ఏకీభవించకపోవచ్చు
- కానీ, వీరు భారతీయ మహిళల గౌరవాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు
- వీరిద్దరూ భారతరత్నకు అర్హులు
మన దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతిలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హరీశ్ రావత్ డిమాండ్ చేశారు. వీరిద్దరూ దేశానికి ఎంతో సేవ చేశారని, మహిళా సాధికారతను పెంపొందించారని ఆయన కొనియాడారు. సోనియా, మాయావతి రాజకీయ వ్యక్తిత్వాలు వేరు కావచ్చని... వీరి రాజకీయాలతో మీరు ఏకీభవించకపోవచ్చని... కానీ, భారతీయ మహిళల గౌరవాన్ని వీరు ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారని అన్నారు.
ఈ నిజాన్ని ఎవరూ కాదనలేరని చెప్పారు. పీడిత, బాధిత మనసుల్లో మాయావతి ఎంతో విశ్వాసాన్ని నింపారని చెప్పారు. వీరిద్దరూ భారతరత్నకు అర్హులని, వీరిని అత్యున్నత పురస్కారంతో సత్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ నిజాన్ని ఎవరూ కాదనలేరని చెప్పారు. పీడిత, బాధిత మనసుల్లో మాయావతి ఎంతో విశ్వాసాన్ని నింపారని చెప్పారు. వీరిద్దరూ భారతరత్నకు అర్హులని, వీరిని అత్యున్నత పురస్కారంతో సత్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.