డబ్ల్యూహెచ్ఓ ఆరోపణలపై స్పందించిన చైనా

  • కరోనా మూలాల పరిశోధనకు డబ్ల్యూహెచ్ఓ ప్రయత్నం
  • చైనా తమకు అనుమతి ఇవ్వట్లేదని ఆరోపణ
  • తాము కరోనా కట్టడిలో నిమగ్నమయ్యామని చైనా వెల్లడి
  • నిపుణుల పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టీకరణ
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తికి సంబంధించిన మూలాలను అన్వేషించేందుకు తాము ప్రయత్నిస్తుంటే చైనా అనుమతులు ఇవ్వట్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై చైనా స్పందించింది. తాము కరోనా కట్టడిలో నిమగ్నమై ఉండడం వల్ల అనుమతుల మంజూరులో జాప్యం జరుగుతోందని వివరణ ఇచ్చింది. తమ దేశంలో పర్యటించే అంతర్జాతీయ నిపుణుల బృందం కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు కొన్ని ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుందని, దాని ప్రకారమే ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేసింది. ప్రస్తుతం నెలకొని  ఉన్న సమస్యలను అధిగమించేందుకు శ్రమిస్తున్నామని తెలిపింది. దీనికి సంబంధించి డబ్ల్యూహెచ్ఓతో ఇప్పటికీ సంప్రదింపులు జరుగుతున్నాయని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది.


More Telugu News