ఏపీలో మరో దాడి... విశాఖలో వినాయక విగ్రహం చేయి ధ్వంసం చేశారు: విష్ణువర్ధన్ రెడ్డి
- రాష్ట్రంలో కొనసాగుతున్న విగ్రహాల ధ్వంసం
- మరో దాడి జరిగిందని వెల్లడించిన విష్ణువర్ధన్ రెడ్డి
- చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వెల్లడి
- తామే బాధితులం అంటూ సీఎం ప్రచారం చేసుకుంటున్నారని విమర్శలు
ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలకు అడ్డుకట్ట పడడంలేదు. తాజాగా, విశాఖలో ఓ హిందూ దేవాలయంపై దాడి జరిగిందని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. విశాఖలో వినాయక ఆలయంలో విగ్రహం చేయి ధ్వంసం చేశారని వివరించారు. ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్న దుండగులపై చర్యలు తీసుకోవడంలేదంటూ వైసీపీ సర్కారును విమర్శించారు.
పైగా, ఈ ఘటనలతో తమను ఇబ్బంది పాల్జేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సీఎం జగన్ చెప్పుకుంటున్నారని ఆరోపించారు. చర్యలు తీసుకునే బదులు, తామే బాధితులం అవుతున్నామని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. గత కొన్నిరోజుల వ్యవధిలోనే రామతీర్థం, రాజమండ్రిలో విగ్రహాల ధ్వంసం ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి.