మీ కాకమ్మ కథలు హిందువులకు చెబుతారా?: వైసీపీ, టీడీపీలపై విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం

  • 'రామతీర్థం'పై రగులుతున్న ఏపీ రాజకీయాలు
  • మేనిఫెస్టోలు చూసుకోవాలంటూ వైసీపీ, టీడీపీపై విష్ణు వ్యాఖ్యలు
  • మీవి ఓటు బ్యాంకు రాజకీయాలంటూ విసుర్లు
  • రెండు పార్టీలు హిందూ ద్రోహులని వెల్లడి
ఏపీ రాజకీయాలన్నీ ఇప్పుడు రామతీర్థం ఘటన చుట్టూ తిరుగుతున్నాయి. వైసీపీ, టీడీపీ హిందూ ద్రోహులని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు హిందూ ద్రోహులుగా మారి మతమార్పిళ్లను ప్రోత్సహించడమే కాకుండా, చర్చిలను కూడా నిర్మించడం హిందూ సమాజానికి తెలియదనుకుంటున్నారనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కనీసం ఒక గుడి నిర్మించారా? అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. మీ కాకమ్మ కథలు హిందువులకు చెబుతారా? అని ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. 'మీ ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రజలు మర్చిపోలేదు. వైసీపీ, టీడీపీ ఓసారి తమ మేనిఫెస్టోలు చూసుకోవాలి' అని హితవు పలికారు. అంతేకాదు, ఆ రెండు పార్టీలు క్రిస్టియన్  మైనారిటీల కోసం ప్రకటించిన హామీల చిట్టాలను కూడా పంచుకున్నారు.


More Telugu News