కడుపునొప్పితో వచ్చిన మహిళ.. కడుపులో నుంచి రెండున్నర కిలోల వెంట్రుకలు తీసిన నిర్మల్‌ జిల్లా వైద్యులు

  • నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఘ‌ట‌న‌
  • మ‌హిళ  మానసిక స్థితి సరిగా లేదన్న వైద్యులు
  •  ఆమెకు వెంట్రుకలు పీక్కొని తినే అలవాటు ఉందని వివ‌ర‌ణ‌
  • తీవ్ర క‌డుపునొప్పిరావ‌డంతో ఆసుప‌త్రికి తీసుకొచ్చిన బంధువులు
నిర్మల్‌ జిల్లా కేంద్రంలో  ఓ మహిళకు అప‌రేష‌న్ చేసిన వైద్యులు ఆమె కడుపులో నుంచి రెండున్నర కిలోల వెంట్రుకలు బయటకు తీశారు. ఆ మ‌హిళ క‌డుపునొప్పితో బాధ‌ప‌డుతుండ‌డంతో ప‌రీక్ష‌లు చేసిన వైద్యులు శ‌స్త్ర‌చికిత్స చేశారు. ఆ మ‌హిళ  మానసిక స్థితి సరిగా లేద‌ని, ఆమెకు వెంట్రుకలు పీక్కొని తినే అలవాటు ఉంద‌ని వైద్యులు తెలిపారు.

ఈ నేప‌థ్యంలో క‌డుపులో వెంట్రుక‌లు ఉన్నాయ‌ని, ఈ మధ్య తరచూ కడుపు నొప్పి వ‌స్తుండేద‌ని చెప్పారు. ఇటీవ‌ల ఆమెకు తీవ్రంగా కడుపు నొప్పి రావంతో ఆమె బంధువులు ఆసుప‌త్రికి తీసుకురావ‌డంతో పరీక్షలు నిర్వహించామ‌ని వివ‌రించారు. ఆమె కడుపులో నుంచి రెండున్నర కిలోల వెంట్రుకలను తీసివేశామని, ఆప‌రేష‌న్  విజయవంతం అయింద‌ని వివరించారు.


More Telugu News