కరోనా మూలాలపై పరిశోధన చేయడానికి చైనా అనుమతి ఇవ్వట్లేదు: డబ్ల్యూహెచ్ఓ
- చివరి నిమిషం వరకు అనుమతులు జారీ చేయకపోవడం సరికాదు
- పలు దేశాల నుంచి నిపుణులు ఇప్పటికే చైనాకు బయలుదేరారు
- చైనా ప్రభత్వంతో కలిసే నిపుణుల బృందం పర్యటనకు ఏర్పాట్లు
- అయినా అనుమతులు ఇవ్వకపోడంతో నిరాశ
కరోనా పుట్టినిల్లు చైనా ఎన్నో విషయాలను దాచి పెట్టి ప్రపంచానికి హాని కలిగించిందని పలు దేశాలు మండిపడ్డ విషయం తెలిసిందే. తాజాగా, చైనా తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా మూలాలపై పరిశోధన చేయడానికి సిద్ధమైన డబ్ల్యూహెచ్ఓ సభ్యులు తమ దేశంలోకి ప్రవేశించేందుకు చైనా చివరి నిమిషం వరకు అనుమతులు జారీ చేయకపోవడం ఆ సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ మండిపడ్డారు.
పలు దేశాల నుంచి నిపుణులు ఇప్పటికే చైనాకు బయలుదేరారని, అయితే, తమ దేశంలోకి ప్రవేశించేందుకు చైనా ఏ ఒక్కరికీ ఇంతవరకు అనుమతులు జారీ చేయలేదని తెలిపారు. చైనా ప్రభుత్వంతో కలిసే తాము నిపుణుల బృందం పర్యటనకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. చైనా ప్రభుత్వ తీరుపై తాను చాలా నిరాశకు గురయ్యానని తెలిపారు.
ఇప్పటికే ఇద్దరు సభ్యులు చైనాకు బయలుదేరారని, వారి పర్యటనకు చైనా అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని, తాను వారితో మాట్లాడానని తెలిపారు. ఆ నిపుణుల బృందం పర్యటన డబ్ల్యూహెచ్ఓతో పాటు ప్రపంచానికి చాలా కీలకం అని తెలిపానని చెప్పారు. చైనా ఇప్పటికైనా అనుమతులు ఇస్తుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.