హైద‌రాబాద్ లో దారుణం.. భార్య‌ను చంపి మూట‌గ‌ట్టి పడేసిన‌ భ‌ర్త

  • కేపీహెచ్ బీ ప‌రిధిలోని ఎస్ఎస్ కాల‌నీలో ఘ‌ట‌న‌
  • భార్య స్ర‌వంతితో భర్త శేఖ‌ర్ గొడవే కార‌ణం?‌
  • మృత‌దేహం కుళ్లిపోవ‌డంతో స్థానికుల‌కు దుర్వాసన
  • పోలీసు‎లకు సమాచారం అందించడంతో వెలుగులోకి
భార్య‌ను దారుణంగా చంపి మూట‌గ‌ట్టి పడేశాడో భ‌ర్త‌. ఈ దారుణ ఘ‌ట‌న హైద‌రాబాద్ లోని కేపీహెచ్ బీ ప‌రిధిలోని ఎస్ఎస్ కాల‌నీలో చోటు చేసుకుంది. భార్య స్ర‌వంతితో భర్త శేఖ‌ర్ త‌రుచూ గొడ‌వ ప‌డేవాడని తెలిసింది. ఈ నేప‌థ్యంలోనే ఆమెను చంపి, మృత‌దేహాన్ని మూట‌క‌ట్టి భ‌వనం ప‌క్క‌న ఉన్న ప్ర‌దేశంలో వ‌దిలి పారిపోయాడు.

ఆమె మృత‌దేహం కుళ్లిపోయి స్థానికుల‌కు దుర్వాసన రావ‌డంతో వారికి అనుమానం వచ్చి, పోలీసు‎లకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దంప‌తుల‌ మధ్య కలహాలే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు భావిస్తున్నారు.


More Telugu News