ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ల పోటీపై బాంబే హైకోర్టు సంచలన తీర్పు
- స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా విభాగం కింద ట్రాన్స్‌జెండర్ల పోటీ
- నామినేషన్లను తిరస్కరించిన అధికారులు
- వారు ఏ విభాగం కిందికి వస్తారో నిర్ణయించుకునే హక్కు ఉందన్న న్యాయస్థానం
ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ల పోటీపై బాంబే హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ట్రాన్స్‌జెండర్లు మహిళా విభాగం నుంచి బరిలోకి దిగొచ్చని స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఓ వార్డు నుంచి మహిళా విభాగం కింద కొందరు ట్రాన్స్‌జెండర్లు పోటీకి దిగారు. అయితే, వారి నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.
దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ట్రాన్స్‌జెండర్లకు అనుకూలంగా తీర్పు చెప్పింది. తాము ఏ వర్గం కిందకు వస్తామో నిర్ణయించుకునే హక్కు వారికి ఉందని స్పష్టం చేసింది. మహిళా విభాగం కింద వారు పోటీ చేసుకోవచ్చంటూ తీర్పు చెప్పిన న్యాయస్థానం.. ట్రాన్స్‌జెండర్లు పోటీ చేయకూడదంటూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది.