మమతకు మరో ఎదురుదెబ్బ.. పదవికి రాజీనామా చేసిన మరో మంత్రి

  • వరుసపెట్టి పార్టీని వీడుతున్న టీఎంసీ నేతలు
  • ఎన్నికలకు ముందు మమతకు వరుస ఎదురుదెబ్బలు
  • త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న లక్ష్మీరతన్ శుక్లా?
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన సువేందు అధికారి సహా 12 మంది కౌన్సిలర్లు ఇటీవల పార్టీని వీడి కాషాయ పార్టీ బీజేపీలో చేరారు. తాజాగా, ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి లక్ష్మీరతన్ శుక్లా తన పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి మమత బెనర్జీ, గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌లకు తన రాజీనామా లేఖను పంపించారు.

రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నానని, అందుకే రాజీనామా చేసినట్టు లేఖలో పేర్కొన్నారు. అయితే, ఆయన త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఎంపీలుగా ఉన్న సువేందు అధికారి తండ్రి శిశిర్, మరో సోదరుడు దివ్యేందు కూడా త్వరలోనే బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందు పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడడం తృణమూల్‌కు పెద్ద దెబ్బేనని అంటున్నారు.


More Telugu News