ప్రముఖ సినీ గేయ రచయిత వెన్నెలకంటి కన్నుమూత

  • గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచిన వెన్నెలకంటి
  • షాక్ కు గురైన తెలుగు సినీ పరిశ్రమ
  • వెన్నెలకంటి కుమారుడు కూడా సినీ రచయితే
ప్రముఖ సినీ గేయ రచయిత వెన్నలకంటి కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. చెన్నైలో ఆయన మృతి చెందారు. వెన్నెలకంటి అసలు పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. ఎన్నో సినిమాలకు ఆయన ఆణిముత్యాల వంటి పాటలను అందించారు. ఆయన మృతి వార్తతో సిని పరిశ్రమ షాక్ కు గురైంది.

సినీ ప్రముఖుల నుంచి సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన కుమారుడు శశాంక్ వెన్నెల కంటి కూడా సినీ రచయితగా ఉన్నారు. దాదాపు 300కు పైగా చిత్రాల కోసం దాదాపు 2 వేలకు పైగా పాటలను ఆయన రచించారు. డబ్బింగ్ చిత్రాలకు పాటలు రాయడంలో ఆయన పేరుగాంచారు. పలు చిత్రాలకు డైలాగ్స్ కూడా రాశారు.

తన జీవిత ప్రస్థానాన్ని ఎస్బీఐ ఉద్యోగిగా వెన్నెలకంటి ప్రారంభించారు. అయితే చిన్నప్పటి నుంచి ఆయనకు సాహిత్యమంటే అమితమైన అభిమానం ఉంది. తన 11వ ఏట ఆయన 'భక్త దుఃఖనాశ పార్వతీశా' అనే శతకాన్ని రాశారు. నటనపై మక్కువతో అప్పుప్పుడు నాటకాలు కూడా వేసేవారు. సినిమాకు పాట రాసే తొలి అవకాశాన్ని నటుడు, నిర్మాత ప్రభాకర్ రెడ్డి ఆయనకు ఇచ్చారు. ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన అవకాశంతో 1986లో 'శ్రీరామచంద్రుడు' సినిమాలో 'చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల' అనే పాట రాశారు. ఆ తర్వాత ఆయన సినీ ప్రయాణం క్రమంగా పుంజుకోకపోవడంతో బ్యాంకు ఉద్యోగానికి ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుంచి సినిమాలతోనే మమేకమై జీవించారు.


More Telugu News