ఆసుపత్రి నుంచి గంగూలీ రేపు డిశ్చార్జి
- గంగూలీ ఆరోగ్యంపై వైద్యుల ప్రకటన
- ఉడ్ ల్యాండ్స్ ఆసుపత్రిలో గంగూలీకి చికిత్స
- రేపటి నుంచి ఇంట్లోనే ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తాం
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురై కోల్ కతాలోని ఉడ్ ల్యాండ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు వివరాలు తెలిపారు. రేపు ఆసుపత్రి నుంచి ఆయనను డిశ్చార్జి చేయనున్నట్లు చెప్పారు. అనంతరం గంగూలీ ఆరోగ్య పరిస్థితిని ఆయన ఇంట్లోనే పర్యవేక్షిస్తామని వివరించారు.
గంగూలీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉండటంతో యాంజియోప్లాస్టీ వాయిదా వేయడమే సురక్షితమని వైద్యులు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. రెండు లేదా మూడు వారాల తర్వాత ఆయన కోలుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత ఆయన చికిత్సకు సంబంధించి మరో కోర్సు ప్రారంభిస్తామని చెప్పారు.