నిన్న రాత్రి నుంచే పోలీసులు బెదిరించ‌డం ప్రారంభించారు: జ‌న‌సేన నేత నాదెండ్ల‌

  • కోదండరామ స్వామి విగ్రహ శిర‌చ్ఛేద‌న‌ దుస్సంఘ‌ట‌న‌ను ఖండిస్తున్నాం
  • రామ‌తీర్థ‌ యాత్ర‌ను ప్ర‌భుత్వం అడ్డుకుంటోన్న తీరు స‌రికాదు
  • తెల్ల‌వారు జాము నుంచే గృహ నిర్బంధాలు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో దేవుళ్ల‌ విగ్రహాలపై జ‌రుగుతోన్న‌ దాడులకు నిరసనగా బీజేపీ-జ‌న‌సేన‌ చేపట్టిన రామతీర్థ ధర్మయాత్రను పోలీసులు అడ్డుకుంటోన్న విష‌యం తెలిసిందే. దీనిపై జ‌న‌సేన స్పందిస్తూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కోదండ రామస్వామి విగ్రహ శిర‌చ్ఛేద‌న‌ దుస్సంఘ‌ట‌న‌ను ఖండిస్తూ తాము చేపట్టిన యాత్ర‌ను ప్ర‌భుత్వం అడ్డుకుంటోన్న తీరును ఖండిస్తున్నామ‌ని జ‌న‌సేన నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ ఓ ప్ర‌క‌ట‌నలో తెలిపారు.

నిన్న రాత్రి నుంచే ఉత్త‌రాంధ్ర జిల్లాల్లోని జ‌న‌సేన వ్య‌వ‌హారాల క‌మిటీ స‌భ్యుల‌ను, నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అరెస్టు చేస్తామ‌ని బెదిరించ‌డం ప్రారంభించార‌ని చెప్పారు. ఈ రోజు తెల్ల‌వారు జాము నుంచే నేత‌ల‌ను, శ్రేణుల‌ను గృహ నిర్బంధంలో ఉంచ‌డంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పోలీసు స్టేష‌న్ల‌కు తీసుకెళ్లార‌ని తెలిపారు. కాగా, పోలీసుల తీరుపై బీజేపీ నేత‌లు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.


More Telugu News