అందుకే దేశంలో వ్యాక్సిన్లపై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు: కేంద్రమంత్రి ధ‌ర్మేంద్ర‌ ప్రధాన్

  • బుద్ధిమాంద్యం ఉన్నవారు విమ‌ర్శ‌లు చేస్తున్నారు
  • శాస్త్రవేత్తలపై నమ్మకం లేనివారే నిరాధార ఆరోపణలు చేస్తారు
  • భారతీయ శాస్త్రవేత్తల నిరంతర కృషి ఫలితం వ్యాక్సిన్లు
  • కాంగ్రెస్‌ నేతల ఆలోచన విధానంలో మార్పు రావాలి
భార‌త్ లో అత్య‌వ‌స‌ర వినియోగానికి రెండు వ్యాక్సిన్ల‌కు అనుమ‌తులు వ‌చ్చిన నేప‌థ్యంలో వాటిపై కొంద‌రు విమ‌ర్శ‌లు గుప్పిస్తోన్న విష‌యం తెలిసిందే. దీనిపై బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. కాంగ్రెస్ నేత‌ల‌తో పాటు ప‌లువురు చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌పై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ స్పందిస్తూ...  బుద్ధిమాంద్యం ఉన్నవారితో పాటు శాస్త్రవేత్తలపై నమ్మకం లేనివారే వ్యాక్సిన్ల‌పై ఇటువంటి నిరాధార ఆరోపణలు చేస్తారని ఆయ‌న సెటైర్ వేశారు.

మ‌న దేశంలో అనుమ‌తులు పొందిన ఈ వ్యాక్సిన్లు దేశీయ ఔషధ సంస్థలు, భారతీయ శాస్త్రవేత్తల నిరంతర కృషి ఫలితంగా వ‌చ్చాయ‌ని తెలిపారు. దేశంలో వ్యాక్సిన్ల అభివృద్ధిలో ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ తీసుకున్న‌ చొరవను భార‌త‌ ప్రజలంతా కొనియాడుతున్నారని ఆయ‌న చెప్పారు. కొంద‌రు మాత్రం అందుకు భిన్నంగా విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అన్నారు. కాంగ్రెస్‌ నేతల ఆలోచన విధానంలో మార్పు రావాలని, ప్రతి అంశాన్ని త‌ప్పుడు ప‌ద్ధ‌తిలో చూసే తీరు స‌రికాద‌ని చెప్పారు.


More Telugu News