తన ఫాంహౌస్ లో పండించిన కూరగాయలను దుబాయ్ కి ఎగుమతి చేయనున్న ధోనీ
- క్యాబేజీ, టమాటాతో పాటు పలు రకాల కూరగాయల ఎగుమతి
- పది ఎకరాల్లో సేంద్రియ పద్దతిలో సాగు
- ఎగుమతుల కోసం ఫాం ఫ్రెష్ ఏజెన్సీతో ఒప్పందం
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తన ఫాంహౌస్ లో పెద్ద ఎత్తున కూరగాయలు పండిస్తున్నారు. అంతేగాక, వాటిని విదేశాలకు ఎగుమతి చేయడానికీ ప్రయత్నాలు జరుపుతున్నారు. క్యాబేజీ, టమాటాతో పాటు పలు రకాల కూరగాయలను దుబాయ్‌కి ఎగుమతి చేయనున్నారు.
దాదాపు పది ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో ఆయన వివిధ రకాల కూరగాయలను పండిస్తున్నారు. ఎగుమతుల కోసం ఆయన ఫాం ఫ్రెష్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఝార్ఖండ్ వ్యవసాయ శాఖ కూడా ఇందుకు సహకారం అందిస్తోంది. దుబాయ్ కి ధోనీ ఫాం హౌస్ నుంచి పంపే కూరగాయల ఎగుమతులపై చర్చలు జరుగుతున్నాయి.
ధోనీ పండించే కూరగాయలకు ఇప్పటికే రాంచీ మార్కెట్లోనూ మంచి డిమాండు ఉంది. రాంచీలోని సెంబో గ్రామం సమీపంలో ఈ ఫాంహౌస్ ఉంది. న్యూఇయర్ వేడుకల కోసం ధోనీ దుబాయ్ లోనే తన ఫ్యామిలీతో కలిసి వెళ్లి ప్రస్తుతం అక్కడే ఉన్నారు.