అమెరికన్ కాంగ్రెస్ స్పీకర్‌గా వరుసగా నాలుగోసారి ఎన్నికైన నాన్సీ పెలోసీ

  • ఏడు ఓట్ల స్వల్ప తేడాతో గట్టెక్కిన వైనం
  • ఆమెకు 216, ప్రత్యర్థి కెవిన్‌కు 209 ఓట్లు
  • ట్రంప్, పెలోసీ మధ్య రెండేళ్లుగా ఘర్షణ వాతావరణం 
అమెరికన్ కాంగ్రెస్ స్పీకర్‌గా డెమొక్రటిక్ పార్టీకి చెందిన నాన్సీ పెలోసీ (80) నాలుగోసారి ఎన్నికయ్యారు. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఏకైక మహిళా సభ్యురాలైన ఆమె ఏడు ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గట్టెక్కారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఆమెకు 216 ఓట్లు రాగా, ఆమె ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కెవిన్ మెక్ కార్తీకి 209 ఓట్లు వచ్చాయి. కాగా, ఆమె పార్టీకే చెందిన ఆరుగురు సభ్యులు మాత్రం ఆమెకు ఓటు వేయకపోవడం గమనార్హం.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడంలో పెలోసీ పాత్ర ఉందన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. దీంతో ట్రంప్, పెలోసీ మధ్య గత రెండేళ్లుగా ఘర్షణ వాతావరణం నెలకొంది.


More Telugu News