తన ఆఫీసును ముంబై నుంచి గోవాకు తరలించిన రామ్ గోపాల్ వర్మ!
- అవసరమైతేనే ముంబైకి వస్తా
- నా ప్రాజెక్టులకు గోవా సరైన ప్రాంతం
- కరోనా కారణంగానే ఈ నిర్ణయం
విభిన్న చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ముంబై నగరాన్ని శాశ్వతంగా వీడారు. ఇకపై తనకు అవసరమైతేనే ముంబైకి వస్తానని ఆయనే స్వయంగా తెలిపారు. తన ఆఫీసు 'ఫ్యాక్టరీ'ని కూడా తరలించేశామని తెలిపారు. ఇకపై తాను గోవాలో ఉంటూ, తన పనులను చూసుకుంటానని స్పష్టం చేశారు.
తన ప్రాజెక్టులకు గోవా సరైన ప్రాంతమని భావించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నానని, లాక్ డౌన్ సమయంలో అధిక సమయం హైదరాబాద్ లోనే ఉండిపోయానని, ఆ తరువాత ముంబై నుంచి ఆఫీసును గోవాకు తరలించానని అన్నారు. కరోనా పరిస్థితులే తానీ నిర్ణయం తీసుకోవడానికి కారణమని వర్మ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మిధున్ చక్రవర్తి ప్రధాన పాత్రలో '12ఓ క్లాక్' అనే హారర్ చిత్రాన్ని వర్మ నిర్మిస్తున్న సంసగతి తెలిసిందే.