కన్నుమూసిన హాలీవుడ్ జేమ్స్ బాండ్ హీరోయిన్

  • తాన్యా రాబర్ట్స్ మృతి
  • ఇటీవల కుప్పకూలిన తాన్యా
  • లాస్ ఏంజెలిస్ ఆసుపత్రిలో చికిత్స
  • పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచిన నటి
జేమ్స్ బాండ్ సినిమాల్లో కథానాయికగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హాలీవుడ్ తార తాన్యా రాబర్ట్స్ కన్నుమూశారు. ఆమె వయసు 65 సంవత్సరాలు. డిసెంబరు 24న తన పెంపుడు కుక్కలతో వ్యాహ్యాళికి వెళ్లిన ఆమె కుప్పకూలిపోయారు. అప్పటినుంచి ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆమె పరిస్థితి విషమించడంతో లాస్ ఏంజెలిస్ లో తుదిశ్వాస విడిచారు.

అందానికి పర్యాయపదంలా నిలిచిన తాన్యా రాబర్ట్స్ 1985లో వచ్చిన 'ఏ వ్యూ టు ఏ కిల్' బాండ్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించారు. ఆ సినిమాలో తాన్యా స్టేసీ సట్టన్ అనే జియాలజిస్టు పాత్ర పోషించారు.

ఇదే కాకుండా అనేక ఇతర హాలీవుడ్ చిత్రాల్లోనూ ఆమె నటించారు. ద బీస్ట్ మాస్టర్, షీనా: క్వీన్ ఆఫ్ ద జంగిల్, బాడీ స్లామ్, నైట్ ఐస్ వంటి చిత్రాలతో అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.


More Telugu News