ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి కావాలని అడుగుతా: రేవంత్ రెడ్డి 

  • కాంగ్రెస్ లో పీసీసీ, ప్రచార కమిటీ ఛైర్మన్ పదవులు కీలకం
  • ప్రచార కమిటీ ఛైర్మన్ పదవిని తీసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నా
  • అభిప్రాయాలను చెప్పుకునే ప్రజాస్వామ్యం కాంగ్రెస్ లో ఉంది
తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతోందనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరు ఏ పాత్ర పోషించాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని రేవంత్ అన్నారు. అయితే తమ అభిప్రాయాలను ప్రతి ఒక్కరూ చెప్పుకునే ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీలో పీసీసీ, ప్రచార కమిటీ ఛైర్మన్ పదవులు చాలా కీలకమని రేవంత్ అన్నారు. ప్రచార కమిటీ ఛైర్మన్ పదవిని తనకు ఇవ్వాలని పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తే... ఆ పదవిని స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఏ పదవి కావాలని అడిగితే తాను ప్రచార కమిటీ ఛైర్మన్ పదవినే అడుగుతానని చెప్పారు. ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలతో పార్టీలో సరికొత్త చర్చ మొదలైంది.


More Telugu News