ఏపీ కరోనా అప్ డేట్: 128 మందికి పాజిటివ్, ముగ్గురి మృతి
- గత 24 గంటల్లో 29,714 కరోనా పరీక్షలు
- అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 21 పాజిటివ్ కేసులు
- అత్యల్పంగా విజయనగరం జిల్లాలో ఒక కేసు
- 252 మందికి కరోనా నుంచి విముక్తి
- యాక్టివ్ కేసుల సంఖ్య 2,943
ఏపీలో కరోనా వ్యాప్తి కనిష్ఠ స్థాయికి పడిపోయింది. గడచిన 24 గంటల్లో 29,714 కరోనా పరీక్షలు నిర్వహించగా 128 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 21 కేసులు గుర్తించారు. తూర్పు గోదావరిలో 19, కృష్ణా జిల్లాలో 15, గుంటూరు జిల్లాలో 15, కర్నూలు జిల్లాలో 12 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 1, పశ్చిమ గోదావరి జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో 252 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలో ఒక్కొక్కరు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,83,210కి చేరింది. 8,73,149 కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా 2,943 మందికి చికిత్స కొనసాగుతోంది. ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 7,118కి చేరింది.