ఇప్ప‌టివ‌ర‌కు 16 మంది టీడీపీ కార్యకర్తలను హ‌త్య చేశారు: చ‌ంద్ర‌బాబు

  • వైసీపీ నేత‌లు హత్యారాజకీయాలు చేస్తున్నారు
  •  పెదగార్లపాడు మాజీ సర్పంచి పురంశెట్టి అంకులు హ‌త్య
  •  జగన్‌ అండ వ‌ల్లే నేరగాళ్లు రెచ్చిపోతున్నారు
  • రాష్ట్రంలో శాంతి భద్రతలు క‌ర‌వ‌య్యాయి
వైసీపీ ప్ర‌భుత్వంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ...  వైసీపీ నేత‌లు  హత్యారాజకీయాలు చేస్తున్నార‌ని తెలిపారు. గురజాల నియోజకవర్గం పెదగార్లపాడు మాజీ సర్పంచి పురంశెట్టి అంకులును హత్య చేసిన వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు. అంకులు 20 ఏళ్లు సర్పంచిగా పని చేశార‌ని చెప్పారు.

వైసీపీ అధికారంలోకి వచ్చినప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 16 మంది టీడీపీ కార్యకర్తలను హ‌త్య చేశార‌ని చంద్ర‌బాబు నాయుడు ఆరోపించారు. ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్యను హ‌త్య చేయ‌డం వైసీపీ హత్యా రాజకీయాలకు నిదర్శనమ‌ని చెప్పారు. ఏపీ ముఖ్య‌మంత్రి జగన్‌ అండ వ‌ల్లే నేరగాళ్లు ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని విమర్శించారు. ప్రశాంతంగా ఉండే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను వైసీపీ నాయ‌కులు నాశ‌నం చేశార‌ని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క‌ర‌వ‌య్యాయ‌ని అన్నారు. 


More Telugu News