నైజర్‌లో నెత్తుటేరులు.. 100 మంది పౌరులను కాల్చి చంపిన ఉగ్రవాదులు

  • ఇద్దరు ఉగ్రవాదులను కొట్టి చంపిన గ్రామస్థులు
  • ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన బోకోహారమ్ ఉగ్రవాదులు
  • రెండు గ్రామాల్లోకి చొరబడి యథేచ్ఛగా కాల్పులు
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నైజర్ ప్రధాని
ఇద్దరు ఉగ్రవాదులను కొట్టి చంపడమే అక్కడి ప్రజల పాపమైంది. ఈ ఘటనతో రగిలిపోయిన ఉగ్రవాదులు గ్రామాలపై తెగబడి దొరికినవారిని దొరికినట్టు కాల్చి చంపారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమాసియా దేశమైన నైజర్‌లో జరిగిందీ ఘటన. తమపై దౌర్జన్యం చేస్తున్న బోకోహారమ్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను గ్రామస్థులు కొట్టి చంపారు.

విషయం తెలిసి ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన ఉగ్రవాదులు మాలి సరిహద్దు వద్ద ఉన్న రెండు గ్రామాల్లోకి చొరబడ్డారు. దొరికిన వారిని దొరికినట్టు కాల్చి చంపారు. ఈ ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై నైజర్ ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు చొరబడి కాల్పులు జరిపిన తోచబంగౌ, జారౌమ్‌‌దారే గ్రామాలను సందర్శించారు. బాధిత ప్రజలకు తన ప్రగాఢ  సానుభూతి తెలిపారు. కాగా, బోకోహారమ్ ఉగ్ర సంస్థకు పాకిస్థాన్‌కు చెందిన ప్రమాదకర ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో సంబంధాలు ఉన్నట్టు నైజర్ అధికారులు తెలిపారు.


More Telugu News