యూకే నుంచి చిత్తూరు వచ్చిన యువకుడికి కరోనా.. కొత్త స్ట్రెయిన్‌పై అనుమానాలు!

  • పరీక్షల్లో తొలుత నెగటివ్..ఆపై పాజిటివ్
  • రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స
  • నమూనాలు సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు
బ్రిటన్ నుంచి ఇటీవల చిత్తూరు వచ్చిన ఓ యువకుడికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. బ్రిటన్ వైరస్ నేపథ్యంలో అతడికి సోకింది సాధారణ వైరస్సా? లేక కొత్త స్ట్రెయినా? అనేది నిర్ధారించుకునేందుకు నమూనాలు సేకరించి తదుపరి పరీక్షలకు పంపించారు.

జిల్లాలోని మిట్టూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ డిసెంబరు 21న యూకే నుంచి చిత్తూరు చేరుకున్నాడు. బ్రిటన్ నుంచి వచ్చిన వారికి వైద్య పరీక్షలు తప్పనిసరి కావడంతో వైద్యులు అతడికి పరీక్షలు నిర్వహించారు. రిపోర్టుల్లో అతడికి నెగటివ్ అని తేలింది. దీంతో ఎందుకైనా మంచిదని అతడిని హోం క్వారంటైన్‌కు తరలించారు.

అయితే, ఆ తర్వాత అతడిలో వైరస్ లక్షణాలు కనిపించడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయించారు. పాజిటివ్ అని తేలడంతో వెంటనే చికిత్స కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. అతడు బ్రిటన్ నుంచి రావడంతో నమూనాలు సేకరించి తదుపరి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు.


More Telugu News