చంద్రబాబు నిన్న డేరా బాబా అవతారం ఎత్తాడు: కొడాలి నాని విమర్శలు
- శనివారం రామతీర్థంలో పర్యటించిన చంద్రబాబు
- విమర్శనాస్త్రాలు సంధించిన కొడాలి నాని
- దేవుడంటే నమ్మకంలేని వ్యక్తి అని వ్యాఖ్యలు
- పదవి కోసం ఎంతకైనా దిగజారతాడని వెల్లడి
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిన్న రామతీర్థం క్షేత్రంలో పర్యటించడంపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శనాస్త్రాలు సంధించారు. దేవుడంటే నమ్మకంలేని వ్యక్తి అని, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేని వ్యక్తి అని, పదవి కోసం ఎంత నీచానికైనా దిగజారే వ్యక్తి అని పేర్కొన్నారు. చంద్రబాబు నిన్న విజయనగరం జిల్లా రామతీర్థం వెళ్లి డేరా బాబా అవతారం ఎత్తాడని వ్యంగ్యం ప్రదర్శించారు.
"అపచారం జరిగిపోయిందని చంద్రబాబు ప్రచారం చేస్తున్నాడు. సీఎం జగన్ క్రైస్తవుడని, సిలువ ధరిస్తాడని, తాను వెంకటేశ్వరస్వామి భక్తుడ్నని చెప్పుకుంటున్నాడు. హిందువులందరూ తనకే ఓటేయాలంటున్నాడు. రాజకీయాల్లో కూడా కులాలు, మతాలు, దేవుళ్లను అడ్డంపెట్టుకునే స్థాయికి దిగజారిపోయాడు" అని వ్యాఖ్యలు చేశారు.