కొవాగ్జిన్ కు అనుమ‌తుల‌పై కేటీఆర్ స్పంద‌న‌!

  • హైదరాబాద్‌కు చెందిన  భార‌త్ బ‌యోటెక్
  • ఐసీఎంఆర్‌, ఎన్ఐవీతో  క‌లిసి కొవాగ్జిన్ అభివృద్ధి
  • డాక్ట‌ర్ కృష్ణ ఎల్లా,‌ సుచిత్ర ఎల్లాపై ప్ర‌శంస‌లు
ఐసీఎంఆర్‌, ఎన్ఐవీతో  క‌లిసి హైదరాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ త‌యారు చేసిన కొవాగ్జిన్ కు అత్య‌వ‌స‌ర వినియోగం కోసం డీసీజీఐ అనుమ‌తులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ భారత్‌ బయోటెక్ చైర్మ‌న్ డాక్ట‌ర్ కృష్ణ ఎల్లాతో పాటు జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్లాను ప్ర‌శంసించారు. శాస్త్రవేత్తలకు అభినంద‌న‌లు తెలిపారు.

ప్రతిభావంత‌మైన శాస్త్ర‌వేత్త‌లు, వ్య‌వ‌స్థాప‌కుల‌ వ‌ల్ల‌ వ్యాక్సిన్ రాజధానిగా నగరం ప్రసిద్ధి చెందుతుందని చెప్పారు. కాగా, భార‌త్ లో కొవాగ్జిన్ తో పాటు కొవిషీల్డ్ వ్యాక్సిన్ల అత్య‌వ‌స‌ర వినియోగానికి డీసీజీఐ అనుమ‌తి ఇచ్చిన నేప‌థ్యంలో ప‌లువురు నేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.


More Telugu News