అశోక్ గజపతి రాజును తొలగించారు.. మ‌రి సుబ్బారెడ్డిని ఎందుకు తొలగించలేదు?: వ‌ర్ల రామ‌య్య‌

  • ఆలయాల పర్యవేక్షణ సరిగా లేదన్నారు
  • వంశపారంపర్య ట్రస్టీ అయిన అశోక్ గజపతి రాజును తొలగించారు
  • మరి బెజవాడ అమ్మవారి మూడు సింహాలు చోరీ అయితే చ‌ర్య‌లేవీ?
  • టీటీడీలో అశ్లీల ప్రవాహం జ‌రిగినప్పుడు చ‌ర్య‌లు తీసుకోలేదు   
మందపల్లి మందేశ్వరస్వామి ఆలయం, విజయనగరం పైడితల్లి ఆలయాలతో పాటు రామతీర్థం రామస్వామి ఆలయ ట్రస్టు చైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తప్పిస్తూ వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య విమ‌ర్శ‌లు గుప్పించారు.

'ముఖ్యమంత్రి గారూ! ఆలయాల పర్యవేక్షణ సరిగా లేదని వంశపారంపర్య ట్రస్టీ అయిన అశోక్ గజపతి రాజును తొలగించారు. మరీ, బెజవాడ అమ్మవారి మూడు సింహాలు దొంగిలించబడినందుకు, అంతర్వేది రథం దగ్ధ‌మైనందుకు మంత్రి వెలంపల్లిని, టీటీడీలో అశ్లీల ప్రవాహం జరిగినప్పుడు సుబ్బారెడ్డిని ఎందుకు తొలగించలేదు?' అని వ‌ర్ల రామ‌య్య నిలదీశారు.


More Telugu News