మీ ఇంట్లోనూ ఇద్దరు మహిళలున్నారు: చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యపై సంచయిత ఆగ్రహం
- మహిళపట్ల మీకున్న అగౌరవాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు
- నన్ను మహాతల్లీ అంటూ వ్యంగ్యంగా సంబోధించారు
- మీ సంకుచిత ధోరణికి ఇది నిదర్శనం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మాన్సాస్ చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. తనపై చంద్రబాబు నాయుడు మహాతల్లి అంటూ సంబోధిస్తూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ ఆమె మండిపడ్డారు.
'మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా అనిపిస్తోంది. ఎవరు బాధ్యులో తెలుసుకోలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చేంతవరకూ మీ స్నేహితుడు, మా బాబాయ్ అశోక్ గజపతి రాజు గారు రామతీర్థం ఆలయ ధర్మకర్త. తప్పులు ఏమైనా జరిగి ఉంటే అది మీ బాధ్యతే' అని సంచయిత అన్నారు.
'మహిళ పట్ల మీకున్న అగౌరవాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. నన్ను మహాతల్లీ అంటూ వ్యంగ్యంగా సంబోధించడం మీ సంకుచిత ధోరణికి నిదర్శనం. మీ ఇంట్లోకూడా ఇద్దరు మహిళలు ఉన్నారు. బహుశా ఆడవాళ్లని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో వారిని అడగండి' అని సంచయిత అన్నారు.
'దేవాలయాలను శుభ్రంచేసే కాంట్రాక్టులను మీ బంధువులకు కట్టబెట్టే అలవాటు మీలా నాకు లేదు చంద్రబాబు నాయుడు గారు. అలాగే, మాన్సాస్ ట్రస్టు ఆస్తులను మీ పార్టీ నాయకులకు పప్పుబెల్లాలు మాదిరిగా కట్టబెట్టిన చరిత్ర నాదికాదు. బాగోతాలన్నీ త్వరలోనే బయటపడతాయి. పూసపాటివారి వారసురాలిగా నిజాయితీగా పనిచేస్తున్నా' అని సంచయిత గజపతిరాజు చెప్పారు.