సినిమా థియేటర్లలోకి ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అనుమతించాలి: ఖుష్బూ
- 50 శాతం సీట్ల సామర్థ్యంతో తెరుచుకున్న థియేటర్లు
- 100 శాతం సామర్థ్యంతో తెరవాలన్న ఖుష్బూ
- తమిళనాడు సీఎంకి వినతి
కరోనా వైరస్ విజృంభణతో మూతపడ్డ సినిమా థియేటర్లు లాక్ డౌన్ సడలింపులతో 50 శాతం సీట్ల సామర్థ్యంతో తెరుచుకుంటోన్న విషయం తెలిసిందే. సినిమా షూటింగులు కూడా తిరిగి కొనసాగుతున్నాయి. థియేటర్లలో ఇప్పుడిప్పుడే సినిమాలు విడుదలవుతున్నాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ వాటిలోకి ప్రేక్షకులను అనుమతిస్తున్నారు.
అయితే, కరోనాకు ముందులా పూర్తి స్థాయి సీట్ల సామర్థ్యంతో థియేటర్లలోని ప్రేక్షకులను అనుమతించేలా చూడాలంటూ సినీనటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ అన్నారు. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి ఆమె విజ్ఞప్తి చేశారు. 100 శాతం సీట్ల సామర్థ్యంతో ప్రేక్షకులకు అనుమతులు ఇస్తే సినీ పరిశ్రమకు మేలు జరుగుతుందని ఆమె చెప్పారు. అయినప్పటికీ, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలన్నీ తీసుకుంటామని తాను హామీ ఇస్తున్నానంటూ ఆమె తెలిపారు.