కరోనా హాట్ స్పాట్ గా మారిన చెన్నై ఐటీసీ గ్రాండ్ చోళ!

  • సిబ్బందిలో 85 మందికి కరోనా
  • అన్ని లగ్జరీ హోటళ్లలో పరీక్షలు
  • శానిటైజేషన్ ప్రక్రియ ప్రారంభం
చెన్నై పరిధిలోని గిండీలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళ, కరోనా కేసుల హాట్ స్పాట్ గా మారింది. ఇక్కడి హోటల్ లో గత వారం చివరిలో 609 మంది నమూనాలు సేకరించి పరీక్షలు చేయించగా, 85 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది. వీరంతా హోటల్ సిబ్బందే కావడం గమనార్హం.

ఈ హోటల్ కు పక్కనే ఉన్న మద్రాస్ ఐఐటీలో ఇటీవల దాదాపు 200 మంది విద్యార్థులకు వ్యాధి సోకినట్టు నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత గ్రాండ్ చోళలో పనిచేస్తున్న వంటవానికి గత నెల 15న పాజిటివ్ వచ్చినట్టు తేలింది. ఆపై హోటల్ లో పనిచేస్తున్న అందరి నమూనాలను అధికారులు సేకరించారు.

తాజా పరిణామంతో ఉలిక్కిపడ్డ అధికారులు, నగరంలోని దాదాపు 25 లగ్జరీ హోటళ్లలోని సిబ్బంది, అతిథులందరికీ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. అన్ని హోటళ్లనూ శానిటైజేషన్ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం వ్యాధి సోకిన అందరినీ ఇళ్లకు పంపించి చికిత్స చేయిస్తున్నట్టు మునిసిపల్ అధికారులు తెలిపారు.



More Telugu News