ఎల్లుండి నుంచి తాడిపత్రిలో ఆమరణదీక్ష చేస్తా: జేసీ దివాకర్ రెడ్డి

  • నాపై తప్పుడు అట్రాసిటీ కేసు పెట్టారు
  • కేసు ఎత్తేసేంత వరకు నిరాహారదీక్ష చేస్తాను
  • మా ఇంట్లోనే కులాంతర వివాహాలు చేసుకున్నాము
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ నెల 4వ తేదీ నుంచి తాడిపత్రిలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు. తనపై పెట్టిన తప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును ఎత్తేసేంత వరకు నిరశనదీక్షను కొనసాగిస్తానని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని... అట్రాసిటీ కేసును రాకీయంగా వాడుకుంటోందని చెప్పారు. సీఐని కులం పేరుతో దూషించినట్టు తనపై తప్పుడు అట్రాసిటీ కేసు పెట్టారని మండిపడ్డారు. రెండేళ్ల నాటి కేసును వాడుకుంటున్నారని అన్నారు. తమ ఇంట్లోనే కులాంతర వివాహాలు కూడా చేసుకున్నామని తెలిపారు.

ఇటీవలే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెళ్లి రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాడిపత్రి అట్టుడుకుతోంది. ఈ తరుణంలో, దివాకర్ రెడ్డి నిరాహారదీక్షకు దిగితే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలున్నాయి.


More Telugu News