మేము గేట్లు ఎత్తితే టీఆర్ఎస్ ఖాళీ అవుతుంది: బండి సంజయ్
- బీజేపీలో చేరేందుకు 25 - 30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు
- బీజేపీలో చేరితే పుణ్యం వస్తుంది
- జర్నలిస్టులను కూడా కేసీఆర్ కసురుకుంటారు
తమ పార్టీలో చేరేందుకు 25 నుంచి 30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని... తాము గేట్లు ఎత్తితే టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు కూడా తమను సంప్రదిస్తున్నారని చెప్పారు.
బీజేపీ ఒక పవిత్రమైన పార్టీ అని... తమ పార్టీలో చేరితే పుణ్యం వస్తుందని అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలను ముఖ్యమంత్రి కేసీఆర్ భోజనానికి పిలిచారా? లేక చర్చలకు పిలిచారా? అనే విషయం కూడా గందరగోళంగా ఉందని చెప్పారు. ఉద్యోగులకు పదోన్నతులు అనేది నిరంతర ప్రక్రియ అని... అలాంటి ప్రక్రియను కూడా నిలిపివేసిన ఘనత కేసీఆర్ దని అన్నారు.
జర్నలిస్టులను కూడా కేసీఆర్ కసురుకుంటారని బండి సంజయ్ విమర్శించారు. జర్నలిస్టులకు డబల్ బెడ్రూమ్, ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని అన్నారు. తమ పార్టీ కీలక నేతల బస్సు యాత్ర ఫిబ్రవరి తర్వాత కొనసాగవచ్చని చెప్పారు. ఆరు నెలల నుంచి ఏడాది పాటు భారీ పాదయాత్ర కూడా కొనసాగబోతోందని తెలిపారు.