మాజీ ఎమ్మెల్యే వెంకట నర్సయ్యను భవిష్యత్ తరాలు గుర్తుంచుకుంటాయి: కేసీఆర్ సంతాపం
- జీవితాంతం తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడ్డారు
- యుక్త వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు
- ప్రతి క్షణం ప్రజల బాగుకోసం పాటుపడ్డారు
ఖమ్మం జిల్లా మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నరసయ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారని సీఎంవో తెలిపింది.
"సీపీఎం పార్టీ అగ్రనేత, మధిర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ కట్టా వెంకట నర్సయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జీవితాంతం తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తిగా వెంకట నర్సయ్యను భవిష్యత్ తరాలు గుర్తుంచుకుంటాయని సీఎం అన్నారు" అని తెలిపింది.
"యుక్త వయసులోనే రాజకీయల్లోకి వచ్చి ప్రతి క్షణం ప్రజల బాగుకోసం పాటుపడిన నర్సయ్య ఎందరికో ఆదర్శప్రాయుడిగా నిలిచారని కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు" అని పేర్కొంది.