తెలంగాణలో న్యూ ఇయర్ కి ఓ రేంజిలో జరిగిన 'మందు' విక్రయాలు!
- తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం
- నాలుగు రోజుల్లో రూ. 758.76 కోట్ల మద్యం విక్రయాలు
- గతేడాది కంటే రూ. 200 కోట్ల అధికం
తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేకున్నప్పటికీ మద్యం అమ్మకాలు మాత్రం దుమ్మురేపాయి. గతేడాదితో పోలిస్తే ఏకంగా 200 కోట్ల రూపాయల అధిక ఆదాయం వచ్చినట్టు ఆబ్కారీ శాఖ తెలిపింది. గత నెల 28 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ. 758.76 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు పేర్కొంది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే రూ. 300 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్టు తెలిపింది.
ఈ నాలుగు రోజుల్లో మొత్తం 8.61 కోట్ల లిక్కర్ కేసులు, 6.62 కోట్ల బీర్ కేసులు అమ్ముడుపోయినట్టు ఆబ్కారీ అధికారులు తెలిపారు. నిజానికి తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలను ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ మద్యం విక్రయాలపై ఆ ప్రభావం కనిపించలేదు. నిషేధం లేని గతేడాదితో పోలిస్తే ఈసారి అంతకుమించిన స్థాయిలో మద్యం విక్రయాలు జరగడం ప్రభుత్వాన్నే ఆశ్చర్యపరుస్తోంది.