బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆస్తుల వివరాలు ఇవిగో!

  • బ్యాంకులో రూ.34 వేలు ఉన్నట్టు వెల్లడి
  • నితీశ్ చేతిలో ఉన్నది రూ.35,885
  • కుమారుడు నిశాంత్ ఆస్తులు కూడా వెల్లడి
  • నిశాంత్ పేరిట బ్యాంకుల్లో కోటి రూపాయలు
బీహార్ ప్రభుత్వంలో సీఎం సహా కేబినెట్ మంత్రులంతా నూతన సంవత్సరం తొలిరోజున తమ ఆస్తుల వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, సీఎం నితీశ్ కుమార్ తన వ్యక్తిగత, కుటుంబ ఆస్తులను వెల్లడించారు. ఆయన పేరిట బ్యాంకులో రూ.34,000 ఉండగా, చేతిలో రూ.35,885 నగదు ఉంది. నితీశ్ కు 98,000 విలువ చేసే నగలు ఉన్నాయి. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో 1000 చదరపు అడుగుల ఫ్లాట్ ఉంది.

ఇక నితీశ్ తనయుడు నిశాంత్ ఆస్తులు కూడా ప్రకటించారు. నిశాంత్ కు పలు బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో రూ.1 కోటి ఉండగా, ఆయన చేతిలో ఉన్నది రూ.28,297 మాత్రమేనట. నిశాంత్ వద్ద రూ.20 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయి. అంతేకాకుండా, పలు రెసిడెన్షియల్ కాంప్లెక్సులు, బీడు భూములు కూడా కలిగి ఉన్నారు.

సీఎం నితీశ్ కంటే ఆయన కేబినెట్ సహచరులే ధనవంతులని తాజా ఆస్తుల వెల్లడి  ద్వారా తేలింది. పలువురు మంత్రులకు ఖరీదైన ప్రాంతాల్లో ఫ్లాట్లు, ఇళ్ల స్థలాలు, విలాసవంతమైన కార్లు, బ్యాంకుల్లో భారీగా నిల్వలు ఉన్నాయి. కొందరి వద్ద పిస్టల్, రైఫిల్ వంటి ఆయుధాలు కూడా ఉన్నాయి.


More Telugu News